News February 13, 2025
కాకినాడ: వేరు వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్య

కాకినాడ జీజీహెచ్‌కు తరలిస్తుండగా బుధవారం ఇరువురు మృతి చెందారు. అల్లూరిలోని గంగవరానికి చెందిన వీర ప్రసాద్ (27) గడ్డి మందు తాగి మృతి చెందాడు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్తిపాడుకు చెందిన ఏసుబాబు (54) వేరే వారి గేదె చనిపోవడానికి తనే కారణమని ఆరోపించారు. రూ. 25 వేలు చెల్లించాలని పెద్దలు తీర్మానించారు. దీంతో విషం తాగి మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 18, 2025
అద్దె అడిగిన ఓనర్‌ను చంపి సూట్‌కేసులో కుక్కారు!

రెంట్ అడగడానికి వెళ్లిన ఓనర్‌ను చంపి సూట్‌కేసులో కుక్కిన ఘటన UPలోని ఘజియాబాద్‌లో జరిగింది. దీపశిఖ శర్మ ఫ్యామిలీకి ఒకే సొసైటీలో రెండు ఫ్లాట్లున్నాయి. రెండో దాంట్లో అద్దెకుంటున్న ఆకృతి-అజయ్ జంటను ఆమె బుధవారం సాయంత్రం రెంట్ అడగడానికి వెళ్లారు. రాత్రి వరకు తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి వెళ్లి చూడగా సూట్‌కేసులో శవాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.
News December 18, 2025
పోలింగ్‌లో మెదక్ జిల్లాకు 5వ స్థానం

జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.37 శాతం పోలింగ్ నమోదై రాష్ట్రంలోనే జిల్లా 5వ స్థానంలో నిలిచిందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడం హర్షణీయమన్నారు. ఎన్నికలను ప్రశాంతంగా విజయవంతంగా ముగించడంలో సహకరించిన అన్ని శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పోలీసు యంత్రాంగం, పాత్రికేయులకు అభినందనలు తెలియజేశారు.
News December 18, 2025
కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న చిత్తూరు కలెక్టర్, ఎస్పీ

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా ప్రగతిపై సీఎం సదస్సులో చర్చించారు. జిల్లా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం సుదీర్ఘంగా చర్చించి పలు అంశాలపై కలెక్టర్, ఎస్పీకి దిశా నిర్దేశం చేశారు.


