News April 19, 2024

కాకినాడ: వైసీపీలోకి మాజీ మేయర్

image

కాకినాడ మాజీ మేయర్ సరోజ ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో YCPలో చేరారు. ఈ మేరకు ఆయన పార్టీ కండువా కప్పి ఆహ్వనించారు. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ.. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన తనకు జనసేనలో సరైన స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. BC వర్గానికి మెజారిటీ సీట్లు ఇచ్చిన జగన్ వెంట నడుద్దామని నిర్ణయించుకుని పార్టీలో చేరానని తెలిపారు. 

Similar News

News September 14, 2024

కాకినాడ: యాంకర్ శ్యామలకు వైసీపీలో కీలకపదవి

image

వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రముఖ యాంకర్ శ్యామల నియమితులయ్యారు. కాకినాడలోని ఇంద్రపాలేనికి చెందిన శ్యామల సీరియల్ నటిగా, యాంకర్‌గా పేరు సంపాదించుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాకినాడ జిల్లాలో వైసీపీ తరఫున విస్తృత ప్రచారం చేశారు.

News September 14, 2024

ఉమ్మడి తూ.గో. జడ్పీ ఇన్‌ఛార్జి CEOగా పాఠంశెట్టి

image

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఇన్‌ఛార్జి సీఈవోగా పాఠంశెట్టి నారాయణ మూర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన కాకినాడ డివిజన్ డీఎల్డీవో విధులు నిర్వర్తిస్తున్నారు. సీఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఇంతవరకు ఇక్కడ సీఈవోగా పనిచేసిన ఎ.శ్రీరామచంద్రమూర్తి రిలీవ్ అయిన విషయం తెలిసిందే.

News September 14, 2024

రాజమండ్రి: 80 ఏళ్ల వృద్ధురాలిపై లైంగిక దాడి

image

రాజమండ్రి పరిధి హుకుంపేటకు చెందిన 80 ఏళ్ల వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లు బొమ్మూరు CI కాశీ విశ్వనాథం శుక్రవారం తెలిపారు. వివరాలు.. కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధురాలు ఇంటి నుంచి బయటకు వచ్చి బస్టాప్‌లో ఉంటుందన్నారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశామన్నారు.