News September 25, 2024
కాకినాడ: ‘వైసీపీలోనే ఉంటా.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు’

మాజీ మంత్రి దాడిశెట్టి రాజా జనసేనలోకి చేరుతున్నారన్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టారు. ఆరోగ్య సమస్యల రీత్యా హైదరాబాద్‌లో ఉన్నానని, ఇలాంటి సమయంలో లేనిపోనివి ప్రచారం చేశారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తాను వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వీడుతున్నాననే మాటలు ఎవరూ నమ్మొద్దన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వెంటనే పార్టీ నేతలను కలుస్తానని చెప్పారు.
Similar News
News December 6, 2025
విమాన సర్వీసుల ఆలస్యంతో ప్రయాణికుల అవస్థలు

రాజమహేంద్రవరం (మధురపూడి) విమానాశ్రయం నుంచి పలు విమాన సర్వీసులు రద్దు కావడం, ఆలస్యంగా రావడంతో ప్రయాణికులు ఇబ్బందులను చవి చూస్తున్నారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లాల్సిన విమాన సర్వీసులను, హైదరాబాద్ వెళ్లే రెండు సర్వీస్‌లను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బెంగళూరు వెళ్లాల్సిన విమానం 7.15 గంటలకు రావాల్సి ఉండగా శుక్రవారంరాత్రి 11 గంటలకు వస్తుందని ప్రకటించారు. ముంబై వెళ్లే విమానాలు సైతం బాగా ఆలస్యంగా నడిచాయి.
News December 6, 2025
నిఘాలో తూర్పు గోదావరి

తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 5 వేల సీసీ కెమెరాలు, 17 డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అదుపు చేయగలిగామని ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. గత 11 నెలల కాలంలో 1137 డ్రంక్ అండ్ డ్రైవ్, 399 పేకాట, 242 కోడి పందేలు, 126 సారా, 49 గంజాయి కేసులు నమోదు చేశామన్నారు. అదృశ్యమైన 136 మంది బాలికల్లో 133 మందిని గుర్తించామని ఎస్పీ పేర్కొన్నారు.
News December 6, 2025
పోలీసులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు: ఎస్పీ

పోలీసు శాఖలో అవినీతి, అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ డి.నరసింహా కిషోర్ స్పష్టం చేశారు. సిబ్బందిపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే బాధ్యులపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ కిషోర్ అన్నారు.


