News July 20, 2024
కాకినాడ: సముద్ర తీరంలో రక్షణ గోడ

ఉప్పాడ ప్రాంతంలో సముద్ర కోత నుంచి తీరానికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాకినాడ వాకలపూడిలోని లైట్ హౌస్ నుంచి ఉప్పాడ కొత్త హార్బర్ ప్రాంతం వరకు కోత ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 14.5 కిలోమీటర్ల మేర రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. సుబ్బంపేట నుంచి హార్బర్ వరకు కెరటాల ప్రభావం తగ్గించడానికి గ్రోయల్ గట్లు నిర్మించనున్నారు.
Similar News
News December 13, 2025
గోపాలపురం మండలంలో పెద్దపులి సంచారం..?

గోపాలపురం మండలం భీమోలులో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని కొందరు రైతులు పెద్దపులిని చూసినట్లు సమాచారం ఇవ్వడంతో DFO దావీదురాజు శనివారం వచ్చి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. 6 ట్రాకింగ్ కెమెరాలు అమర్చామన్నారు. ఒంటరిగా ఎవరు తిరగొద్దని, పోలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సాయంత్రం 5 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. వేణు గోపాల్, శ్రీనివాసరావ్, రిస్క్ టీం పాల్గొన్నారు.
News December 13, 2025
ఈనెల 14 నుంచి జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు: SE

జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు APEPDCL SE కె.తిలక్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో విద్యుత్ పొదుపుపై వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు, వినియోగదారులకు స్టార్ రేటెడ్ గృహెూపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంజనీరింగ్ కళాశాలలో వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.
News December 13, 2025
ఈనెల 15న యథావిధిగా PGRS: కలెక్టర్

డిసెంబర్ 15 సోమవారం జిల్లా కలెక్టరేట్ నుంచి గ్రామ/వార్డు సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథావిధిగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని తెలిపారు. అర్జీదారులు తమ వినతులను Meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితి తెలుసుకోవడానికి 1100 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.


