News December 14, 2024

కాకినాడ సిపోర్టు వద్ద మరో చెక్పోస్ట్ ఏర్పాటు

image

పేదల ఆహార భద్రత కోసం నిర్దేశించిన పీడీఎఫ్ బియ్యం రీసైక్లింగ్, అక్రమ ఎగుమతులను నిరోధించే చర్యలలో భాగంగా కాకినాడ జిల్లాలో మరో చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసిన్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడ సీ పోర్ట్ వద్ద మరో చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కాకినాడ సిపోర్టు వద్ద లారీల రద్దీ ఎక్కువ ఉండకుండా పోలీస్ అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.

Similar News

News January 21, 2025

అమలాపురం: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట అమలాపురం రూరల్ పోలీసులను మంగళవారం ఆశ్రయించింది. అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామానికి చెందిన మధుర వెంకటేష్, కాకినాడ పట్టణానికి చెందిన సబ్బతి ప్రమీలా దేవి ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న అనంతరం ఇరు కుటుంబాల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ అమలాపురం రూరల్ పోలీసులను కోరారు.

News January 21, 2025

కిర్లంపూడి: రహదారి ప్రమాదంలో స్నేహితుల మృతి

image

కాకినాడ జిల్లాకు చెందిన దాసరి నిమ్స్ చంద్ర(23), ముక్త దుర్గ బాబు(24)లు బైక్‌పై వెళ్తుండగా విజయవాడ హైవేపై నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. నిమ్స్‌చంద్ర తండ్రి ఆటో డ్రైవర్, తల్లి అంగన్ వాడీ కార్యకర్త. కిర్లంపూడికి చెందిన ముక్తదుర్గసాయి తమ్ముడు 10 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇప్పుడు కుమారుడి మరణంతో తల్లిదండ్రులు ముత్తా పెద్దకాపు, సరస్వతి విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

News January 21, 2025

గోకవరం: నేరస్థుడికి ఐదేళ్లు జైలు-ఎస్సై

image

గోకవరం గ్రామానికి చెందిన పిల్లి ఆనందబాబుకు ఐదేళ్ల జైలు రూ.22 వేలు జరిమానాను అడిషనల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీ లలిత విధిస్తూ తీర్పునిచ్చారు. 2015 సంవత్సరంలో గోకవరానికి చెందిన స్వాతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని శారీరకంగా ఇబ్బంది పెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పిల్లి ఆనందబాబుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజమండ్రి కోర్టులో నేరం రుజువు చేయడంతో శిక్ష పడినట్లు గోకవరం ఎస్సై సోమవారం తెలిపారు.