News November 1, 2024

కాకినాడ: స్థలం విషయంలో వివాదం.. ముగ్గురు మృతి

image

కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని సలపాక చిన్నపేటలో రెండు కుటుంబాల మధ్య  గురువారం ఘర్షణ చెలరేగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై మరొక కుటుంబం  దాడి చేయడంతో ముగ్గురు మృతి చెందారు. స్థలం విషయంపై కొంతకాలంగా వివాదం జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. గొల్లపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఘర్షణకు దిగి‌న రెండు కుటుంబాలు ఎదురెదురుగానే ఉండటం గమన్హారం.

Similar News

News November 19, 2025

ప్రతి 3వ శుక్రవారం ఫిర్యాదులకు అవకాశం: కలెక్టర్

image

ఉద్యోగుల ఫిర్యాదుల దినోత్సవంలో భాగంగా ప్రతి మూడవ శుక్రవారం ఉద్యోగులు తమ వ్యక్తిగత సమస్యలు సహా అన్ని రకాల ఫిర్యాదులను నేరుగా సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రకటించారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రత్యేక ఐడీతో పోర్టల్‌లో నమోదు చేస్తారు. ఈ ప్రత్యేక నంబర్ ద్వారా ఉద్యోగి తన ఫిర్యాదు స్థితిని ఆన్‌లైన్‌లో ట్రాక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నట్లు ఆమె తెలిపారు.

News November 19, 2025

నేడు అన్నదాత సుఖీభవ నిధులు జమ: కలెక్టర్

image

జిల్లాలో అర్హులైన 1,14,991 మంది రైతులకు PM-KISAN 21, అన్నదాత సుఖీభవ–2 పథకాల కింద మొత్తం రూ.7,699.90 లక్షల నిధులు జమ కానున్నాయని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ఈ మేరకు బుధవారం నిడదవోలులో మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్.ఎస్.కే స్థాయి వరకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.