News February 15, 2025
కాకినాడ: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్చ దివస్‌పై సమావేశం

ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచించారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. శనివారం చేపట్టవలసిన కార్యచరణపై చర్చించారు.
Similar News
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ఒడిశా వెళ్లిన CI

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల కేసులో విచారణ నిమిత్తం వెస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మురళీ మోహన్ తన బృందంతో ఒడిశాకు వెళ్లారు. యువతి కుటుంబ సభ్యులు ఫోన్లో అందుబాటులో లేకపోవడంతో యూనివర్సిటీ అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. కాగా యువతిని ఇప్పటికే బంధువుల ఇంట్లో ఉంచారని.. కేసు తమకు అవసరం లేదని వర్సిటీ అధికారులకు తల్లిదండ్రులు చెప్పినట్లు సమాచారం.
News December 8, 2025
చిత్తూరు జిల్లాలో కొత్త మోసం.. జాగ్రత్త.!

చిత్తూరులో కూరగాయలు అమ్మే ఓ వ్యక్తి తన బ్యాంక్ అకౌంట్‌ను రూ.10వేలకు వేరే వాళ్లకు విక్రయించాడు. వాళ్లు అతని పేరుతో ఫేక్ కంపెనీ సృష్టించి ట్యాక్స్‌లు ఎగ్గొట్టారు. GST అధికారులు రూ.12కోట్ల ట్యాక్స్ కట్టాలని నోటీసు ఇవ్వడంతో అసలు విషయం వెలుగు చూసింది. సైబర్ నేరగాళ్లు సైతం ఇలా పేదల అకౌంట్లు తీసుకుని మోసాలు చేస్తున్నారు. అకౌంట్ పేరు ఉన్నవాళ్లే కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.
News December 8, 2025
అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు గడువును విద్యాశాఖ మరోసారి పొడిగించింది. అన్నమయ్య జిల్లా DEO సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. రూ.50 అపరాధ రుసుంతో ఈనెల 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈనెల 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో ఈనెల 18 వరకు విద్యార్థులు ఫీజులు చెల్లించుకోవాలని సూచించారు.


