News June 19, 2024
కాకినాడ: 100 కేసులు దాటేశాయ్.. భయం

కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లి, బెండపూడి గ్రామాల్లో డయేరియా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కొమ్మనాపల్లిలో 90, బెండపూడిలో 18మంది ఈ వ్యాధిన పడ్డారు. జిల్లాలో 2022లో ఐదుగురు బాధితులుంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 100 దాటడం భయం కలిగిస్తోంది. అధికారులు వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
➠ వ్యాధి లక్షణాలు
☛ వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి
☛ దాహం, నోరు ఎండిపోవడం
☛ మూత్ర విసర్జన తగ్గిపోవడం.
Similar News
News December 11, 2025
PHC & UPHC సేవల్లో అగ్రస్థానంలో తూ.గో జిల్లా

జూన్ 2025 – డిసెంబర్ 2025 వరకు నిర్వహించిన IVRS Perception Feedback Analysisలో తూ.గో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 87.5% సానుకూల స్పందన నమోదు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ ర్యాంకింగ్ జిల్లా వైద్య ఆరోగ్య వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. అలాగే మరింత ఉన్నత ప్రమాణాలతో సేవలు అందించాల్సిన బాధ్యత పెరిగిందన్నారు.
News December 11, 2025
రాజమండ్రి: ‘యూరియా కొరత లేదు’

జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 7599.34 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. డీసీఎంఎస్లో 257.36, పీఏసీఎస్లో 2530.03, ఆర్ఎస్కేల్లో 114.53, ప్రైవేట్ డీలర్ల వద్ద 1993.10, మార్క్ఫెడ్ వద్ద 2604.20, హోల్సేల్ ప్రైవేట్ డీలర్ల వద్ద 100.14 మెట్టు టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు.
News December 11, 2025
కందుల దుర్గేశ్కు 7వ ర్యాంకు

పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాలనలో జెట్ స్పీడ్ చూపిస్తున్నారు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 7వ ర్యాంకు సాధించి సీఎం ప్రశంసలు పొందారు. జనసేన కోటాలో మంత్రి అయిన దుర్గేశ్.. 316 ఫైళ్లను కేవలం 3 రోజుల 9 గంటల 21 నిమిషాల సమయంలోనే క్లియర్ చేసి సత్తా చాటారు. కాగా ఫైళ్ల పరిష్కారంలో జనసేనాని పవన్ కళ్యాణ్ 11వ స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే.


