News June 19, 2024
కాకినాడ: 20 నుంచి ITI విద్యార్థులకు ఇంటర్వ్యూలు
కాకినాడ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20వ తేదీన ఇటర్వ్యూలు ఉంటాయని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్, కన్వీనర్ వేణుగోపాల వర్మ మంగళవారం తెలిపారు. కాకినాడ ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు. 554 మందికి ఈ నెల 20 నుంచి 25వ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News September 19, 2024
ఉండ్రాజవరం: కత్తెరతో భర్తను హత్య చేసిన భార్య
ఉండ్రాజవరం మండలం శివారు రెడ్డి చెరువులో శ్రీనివాసరావు (41) పై భార్య రాణి కత్తెరతో దాడి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అతను బుధవారం మృతి చెందాడని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అనుమానంతో భార్యని నిలదీయడంతో రెండు నెలల నుంచి వీరి మధ్య మనస్పర్ధలు కొనసాగుతున్నాయన్నారు. ఈ విషయమై ఘర్షణ తలెత్తడంతో మంగళవారం రాత్రి రాణి తన భర్త గుండెల్లో కత్తెరతో పొడవగా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు.
News September 19, 2024
గోకవరం: ఆర్టీసీ బస్సులో 30 కిలోల గంజాయి సీజ్
గోకవరం మండలం రామన్నపాలెం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సులో గోకవరం పోలీసులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో బస్సులోని అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరి మహిళలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 30 కిలోలు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసి ఘటనపై విచారణ చేపట్టామన్నారు.
News September 19, 2024
తూ.గో.: ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
పదో తరగతి ఉత్తీర్ణులైన, ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఉమ్మడి జిల్లాలోని ఐటీఐలో ప్రవేశం కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో మిగులు సీట్ల భర్తీకి నాలుగో విడత అడ్మిషన్స్ కోసం దరఖాస్తులు చేసుకోవాలని రాజమండ్రి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రాధా రామకృష్ణన్ బుధవారం కోరారు. అభ్యర్థులు ధ్రువపత్రాలతో వెబ్‌సైట్ ద్వారా 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 27న దరఖాస్తులను పరిశీలిస్తామని తెలిపారు.