News December 24, 2024

కాకినాడ: 20 మందిపై కేసులు.. 10 మందికి జైలు

image

మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 20 మందిపై కాకినాడ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం కేసులు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ నరసింహారావు వారికి జరిమానా, జైలు శిక్ష విధించారని ట్రాఫిక్ సీఐలు రమేష్, రామారావు తెలిపారు. పది మందికి ఒక్కొక్కరికి రెండు రోజులు చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించారని తెలిపారు.

Similar News

News January 26, 2025

రాజమండ్రిలో ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య- ఎస్సై

image

రాజమండ్రి పనసచెట్టు సెంటర్ ప్రాంతానికి చెందిన సాలా బాల పరమేశ్వరి(35) ఆర్థిక ఇబ్బందులతో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. భర్త మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. మృతదేహాన్ని త్రీ టౌన్ పోలీసులు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డెడ్‌బాడీని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

News January 26, 2025

కడియం: నర్సరీ మొక్కలతో జాతీయ జెండా 

image

76వ గణతంత్ర వేడుకలకు శుభాకాంక్షలు తెలిపుతూ కడియం పల్ల వెంకన్న నర్సరీలో మొక్కలు కూర్పుతో రిపబ్లిక్ డే సందేశాన్ని శనివారం రైతులు ప్రదర్శించారు. మువ్వన్నెల జెండా, ఎర్రకోట, ఆకృతులతో, రిపబ్లిక్ డే అక్షరమాలికను నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్, వినయ్‌లు సందేశాత్మకంగా తీర్చిదిద్దారు. ఎర్రకోటపై జాతీయ జెండా రెపరెపలాడుతూ 76 వవసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆకృతిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

News January 25, 2025

గోపాలపురంలో మాంసం దుకాణాలు బంద్

image

గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని గోపాలపురం మండలంలో రేపు మాంసం, మద్యం దుకాణాలు బంద్ చేయాలని తహశీల్దార్ కె.అజయ్ బాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇవాళ రాత్రి నుంచి ఎలాంటి జంతు వధ చేయరాదన్నారు. చేపల మార్కెట్లను మూసివేయాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.