News April 5, 2024
కాకినాడ: 3 ఎన్నికలు.. 3 పార్టీలు గెలుపు
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2008లో కాకినాడ రూరల్ ఏర్పాటైంది. కాగా ఈ నియోజకవర్గంలో తొలిసారి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కురసాల కన్నబాబు PRP నుంచి బరిలో నిలిచి కాంగ్రెస్ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో పిల్లి అనంతలక్ష్మి TDP నుంచి, 2019లో కురసాల కన్నబాబు YCP నుంచి గెలుపొందారు. ఇలా జరిగిన 3 ఎన్నికల్లో 3 వేర్వేరు పార్టీలు గెలుపొందాయి. మరి ఈ సారి ఏ పార్టీ జెండా ఎగిరేనో..?
Similar News
News January 25, 2025
నేడు రాజమండ్రి విమనాశ్రయానికి టెక్నికల్ టీం రాక
రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో నూతన టెర్మినల్ భవనం నిర్మాణంలో శుక్రవారం మిషనరీ పనులు నిర్వహిస్తుండగా క్రేన్ ద్వారా అమరుస్తున్న పిల్లర్ సెట్టింగ్ జారిపడి విషయం విధితమే. ఇద్దరికీ స్వల్పగాయాలయ్యాయని ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ జ్ఞానేశ్వరరావు తెలిపారు. ప్రమాదానికి కారణాలను అంచనాలు వేసేందుకు చెన్నై, హైదరాబాద్ టెక్నికల్ టీమ్స్ శనివారం వస్తున్నట్టు తెలిపారు. ప్రమాదంలో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తారని తెలిపారు.
News January 24, 2025
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం
రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం ప్రమాదం జరిగింది. అధికారుల వివరాల ప్రకారం.. స్థానికంగా కొత్త టెర్మినల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. ఆ సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
News January 24, 2025
అయినవిల్లి: యువతి కిడ్నాప్.. కేసు నమోదు
అయినవిల్లి మండలం సిరిపల్లికి చెందిన పదహారేళ్ల యువతిని కిడ్నాప్ చేసిన ఘటనపై కేసు నమోదు చేశామని హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లికి చెందిన దింపు కార్మికుడు సాయి బుధవారం రాత్రి తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ యువతి తండ్రి ఫిర్యాదు చేశారన్నారు. దింపులు తీసేందుకు వచ్చిన సాయి స్థానికంగా ఉంటూ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు.