News June 7, 2024
కాకినాడ: 3 పార్టీల నుంచి పోటీ.. నాలుగు సార్లు ఓటమి

పారిశ్రామికవేత్త చలమలశెట్టి సునీల్‌కు రాజకీయాలు కలిసిరాలేదనడానికి తాజా ఓటమి బలం చేకూరుస్తోంది. తొలిసారి 2009లో కాకినాడ పార్లమెంట్ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో వైసీపీ, 2019లో టీడీపీ నుంచి పరాజయం పొందారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి బరిలో నిలవగా..37.06 శాతం ఓటింగ్‌తో మళ్లీ ఓటమి తప్పలేదు. ఈయన మొత్తం 4 సార్లు పోటీ చేయగా.. 3 పార్టీల నుంచి బరిలో నిలవడం గమనార్హం.
Similar News
News September 12, 2025
తూ.గో జిల్లా హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి

గండేపల్లి మండల ఎంపీడీవోగా పనిచేసి, ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డీఎల్డీఓగా పదోన్నతి పొందిన నాతి బుజ్జి, తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు వచ్చారు. శనివారం ఆమె హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం డిప్యుటేషన్ పద్ధతిలో జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
News September 12, 2025
బాలికపై లైంగిక దాడి చేసిన యువకుడిపై కేసు పెట్టాం: కొవ్వూరు సీఐ

కొవ్వూరులో మైనర్ బాలికపై లైంగిక దాడి చేసిన దాసరి వెంకటేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు కొవ్వూరు పట్టణ సీఐ పి. విశ్వం తెలిపారు. బాలికను యువకుడు ప్రేమ పేరుతో మోసం చేశాడని బాలిక తల్లి ఫిర్యాదు చేసిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై ఎస్సీ అట్రాసిటీతో పాటు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
News September 12, 2025
తూ.గో: 91 మందిపై కేసులు నమోదు

ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు రాత్రి వేళ్లల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 577 వాహనాలను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా లేని 91 వాహనదారులపై కేసులు నమోదు చేశారు. దీంతోపాటు 5 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 171 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.