News March 1, 2025

కాకినాడ: 5,6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

image

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.

Similar News

News March 3, 2025

280 మంది ఇంటర్ పరీక్షలు రాయలేదు: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో సోమవారం ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 280 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జనరల్, వొకేషనల్ విభాగాలకు కలిపి మొత్తం 12,318 మంది విద్యార్థులకు గాను 12,038 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మాస్ కాపీయింగ్ జరగలేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

News March 3, 2025

చిరంజీవి గారూ.. కూతుళ్లూ వారసులే: కిరణ్ బేడీ

image

‘వారసత్వం కోసం ఓ మగబిడ్డను కనమని చరణ్‌ను అడుగుతుంటా’ అని ఇటీవల చిరంజీవి చేసిన <<15434876>>వ్యాఖ్యలు<<>> వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ తాజాగా స్పందించారు. ‘చిరంజీవి గారూ.. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి. మీరు ఎలా వారిని పెంచుతారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన పేరెంట్స్ నుంచి నేర్చుకోండి. అమ్మాయిలేం తక్కువ కాదు’ అని ట్వీట్ చేశారు.

News March 3, 2025

ఇండియన్‌ని కాల్చిచంపిన జోర్డాన్ ఆర్మీ

image

జోర్డాన్ నుంచి అక్రమంగా ఇజ్రాయిల్‌‌లోకి ప్రవేశిస్తున్న భారతీయుణ్నిఅక్కడి బలగాలు కాల్చిచంపాయి. కేరళకు చెందిన థామస్ గాబ్రియల్, ఎడిసన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్రమంగా సరిహద్దు దాటాలని ప్రయత్నించగా ఆర్మీ కాల్పులు జరిపింది. థామస్ అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ విషయాన్ని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. వీరిద్దరూ టూరిస్ట్ వీసాపై అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!