News March 1, 2025
కాకినాడ: 5,6 తేదీల్లో మహిళా ఉద్యోగులకు సెలవు

ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఆటల పోటీల్లో పాల్గొనేందుకు 5, 6 తేదీలలో స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళా ఉద్యోగులు అందరూ వివిధ క్రీడల్లో పాల్గొనేందుకు వీలుగా సెలవు ప్రకటించామన్నారు.
Similar News
News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్‌కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
News March 20, 2025
తిరుపతిలో యువకుడు దారుణ హత్య

తిరుపతి గ్రామీణ మండలం వేదాంతపురం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. దాదాపు 30 సంవత్సరాల వయసు కలిగిన యువకుడిని రెండు మూడు రోజుల క్రితం హత్య చేశారు. మృతుడు మొఖం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతుడు వద్ద ఇటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తిరుచానూరు పోలీసులు, క్లూస్ టీం బృందం పరిశీలించింది.
News March 20, 2025
లక్షటిపేట: చేపల వేట.. మత్స్యకారుడి మృతి

లక్షటిపేట మున్సిపాలిటీలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి లింగయ్య 65 మత్స్యకారుడు మృతి చెందినట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. మృతుడు చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోజులాగే చేపల వేటకు గోదావరికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు వెతకగా ఒడ్డున చనిపోయి ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.