News May 23, 2024

కాకినాడ: ACB వలలో పరిశ్రమల శాఖ GM

image

ఏపీ ప్రభుత్వ పరిశ్రమల శాఖ కాకినాడ జిల్లా జనరల్ మేనేజర్ టీ.మురళి బుధవారం రాత్రి ఏసీబీ వలలో చిక్కారు. ఐస్ ఫ్యాక్టరీ యజమాని పెమ్మాడి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అధికారులు వల పన్ని పట్టుకున్నారు. పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీ కోసం బాధితుడు జీఎంను కలిశారు. ఇందుకు గానూ మురళి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు చేసేదిలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

Similar News

News August 31, 2025

దివ్యాంగులకు యథావిధిగా పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

image

సెప్టెంబర్ 1న జిల్లాలోని దివ్యాంగులకు పెన్షన్లు యథావిధిగా పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. జిల్లాలో మొత్తం 2,35,813 మందికి రూ.102.80 కోట్ల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు ఆమె ఆదివారం వెల్లడించారు. జిల్లాలోని 33,117 దివ్యాంగుల పెన్షన్లలో కేవలం 33 మంది మినహా మిగిలిన వారందరికీ పెన్షన్లు అందజేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.

News August 31, 2025

ఇకపై డిజిటల్ విధానంలో చెల్లింపులు: కలెక్టర్

image

ప్రభుత్వం పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలు సులభతరంగా పన్నులు చెల్లించేందుకు స్వర్ణ పంచాయితీ వెబ్ సైట్ ను ప్రవేశపెట్టినట్టు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. అసెస్‌మెంట్ ఆధారంగా ప్రజలు ఇంటి పన్నులు డిజిటల్ రూపంలోనే చెల్లించవలసి ఉంటుందన్నారు. ఇకపై డిజిటల్ చెల్లింపులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ చెల్లింపులు నేరుగా గ్రామ పంచాయితీ ట్రెజరీ ఖాతాలోనే జమ అవుతాయన్నారు.

News August 31, 2025

రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

రాజమండ్రి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా అర్జీలు సమర్పించి పరిష్కారం పొందవచ్చని ఆమె సూచించారు. అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.