News January 31, 2025

కాగజ్‌నగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

image

కాగజ్‌నగర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ అంజయ్య తెలిపారు. గురువారం కాగజ్‌నగర్ బస్టాండ్ వెనుక సర్వే నెంబర్ 143లో మున్సిపల్ నైట్ షెల్టర్ కోసం కేటాయించిన ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలను తొలగించామన్నారు. ఇందులో ఓ బేస్ మెంట్, రోడ్డును ఆక్రమించి చేపట్టిన షెడ్, ఓ నిర్మాణాన్ని కూల్చేశామన్నారు.

Similar News

News October 21, 2025

సూర్యాపేట ఘటనకు పదేళ్లు.. అమరులైన పోలీసులు

image

సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌ వద్ద 2015, ఏప్రిల్ 1న సిమీ ఉగ్రవాదులు పోలీసులపై జరిపిన కాల్పుల ఘటనకు నేటితో పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ దారుణంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ మెట్టు లింగయ్య, హోంగార్డు మహేష్ అక్కడికక్కడే మృతి చెంది అమరులయ్యారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనను జిల్లా పోలీసులు, ప్రజలు నేటికీ మరువలేక అమరుల త్యాగాన్ని స్మరించుకుంటున్నారు.

News October 21, 2025

కొయ్యలగూడెం అమ్మాయికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

“ముదితల్ నేర్వగరాని రాని విద్య కలదే ముద్దారగ నేర్పింపగన్” అన్న ఆర్యోక్తి దాసరోజు అలేఖ్యకి వర్తిస్తుంది. కోచ్, తండ్రి శ్రీధర్ పర్యవేక్షణలో తొమ్మిదవ తరగతి విద్యనభ్యసించే కొయ్యలగూడెం విద్యార్థి అలేఖ్య కరాటే విభాగంలో జాతీయ, అంతర్జాతీయ పోటీలలో పలు పతకాలు సొంతం చేసుకుంది. చెన్నైలో గత నెల 18న నిర్వహించిన సెలక్షన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది.

News October 21, 2025

రాజ్ ఇంట్లో సమంత దీపావళి సెలబ్రేషన్స్

image

బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి హీరోయిన్ సమంత దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు. పండగ సందర్భంగా సామ్ ఆయన ఇంటికి వెళ్లారు. రాజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి బాణసంచా కాల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘నా మనసు కృతజ్ఞతతో నిండిపోయింది’ అని క్యాప్షన్ ఇచ్చారు. కాగా వీరు లవ్‌లో ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.