News January 31, 2025
కాగజ్‌నగర్‌లో గురుకులంలో గ్యాస్ లీక్

కాగజ్‌నగర్ పెట్రోల్ పంపు ఏరియాలోని జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం గ్యాస్ లీక్ అవటంతో మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్‌తో మంటలు ఆర్పేశారు. కాసేపు ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాపాయస్థితి తప్పిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News February 12, 2025
ములకలచెరువు: రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం మృతి

రోడ్డుప్రమాదం ఓ కుటుంబం మొత్తాన్ని కబళించింది. ములకలచెరువులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లె ప్రశాంతనగర్‌కు చెందిన భార్యాభర్తలు, పిల్లలు మృతి చెందారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తప్పు ఎవరిదైనా ప్రమాదంలో నాలుగు ప్రాణాలు పోవడం తీరని విషాదం. ఈ ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది. డ్రైవింగ్ చేసే ముందు మనకూ ఒక కుటుంబం ఉందని గుర్తించండి.
News February 12, 2025
ఈనెల 15న ఆటో డ్రైవర్ల రాష్ట్రవ్యాప్త ఆందోళన

TG: సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపట్టనున్నట్లు ఆటో డ్రైవర్స్ ఐకాస ప్రకటించింది. కార్మికులకు నెలకు రూ.12వేలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు అమలు చేయలేదని ఐకాస కన్వీనర్ వెంకటేశం తెలిపారు. సమ్మెకు పిలుపునిస్తే మంత్రి పొన్నం ఇంటికి పిలిపించి మాట్లాడారని, కానీ 4 నెలలైనా పరిష్కారం చూపలేదని వాపోయారు. ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రూ.10వేల Cr విడుదల చేయాలన్నారు.
News February 12, 2025
MBNR: ఇద్దరు ఎస్‌ఐల బదిలీ: డీఐజీ

జోగులాంబ గద్వాల జోన్-7 పరిధిలో ఇద్దరు ఎస్‌ఐలను బదిలీ చేసినట్టు డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్ తెలిపారు. రాజాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న కేతావత్ రవిని మహబూబ్ నగర్ వీఆర్‌కు బదిలీ చేయగా, జడ్చర్ల PS ఎస్సై శివానందంను రాజాపూర్ పోలీస్ స్టేషన్‌కి బదిలీ చేశారు. ఈమేరకు డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.