News March 2, 2025

కాగజ్‌నగర్‌లో ట్రైన్ ఢీకొని మహిళ మృతి

image

కాగజ్‌నగర్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ప్లాట్ఫారం నంబర్ 3పై గుర్తు తెలియని మహిళ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే కానిస్టేబుల్ సురేశ్ ఆదివారం తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. మృతురాలి సమాచారం ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News November 7, 2025

అక్టోబర్‌లో రూ.119.35 కోట్లు ఆదాయం

image

తిరుమల శ్రీవారి హుండీ ద్వారా అక్టోబర్ నెలలో రూ.119.35 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ ప్రకటించింది. స్వామివారిని 22.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. 1.23 కోట్ల లడ్డూలు విక్రయం జరిగింది. 34.20 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. తలనీలాలు 8.31 లక్షల మంది స్వామి వారికి సమర్పించారు.

News November 7, 2025

సిరిసిల్ల: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

image

సిరిసిల్లలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థిని సుధగోని లహరి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైందని ప్రధానోపాధ్యాయులు శారదా తెలిపారు. ఈ పోటీలు ఖమ్మం జిల్లా పినపాక మండలం బయ్యారంలో ఈనెల 8 నుంచి 10 వరకు జరుగుతాయన్నారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన లహరిని ప్రధానోపాధ్యాయురాలు శారద, PET టీచర్ సురేష్, ఉపాధ్యాయులు అభినందించారు.

News November 7, 2025

కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య

image

కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుమూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రేపల్లెలోని 5వ వార్డుకు చెందిన గరికపాటి రమాదేవి (29) పెనుమూడి-పులిగడ్డ వారధిపై నుంచి నదిలోకి దూకింది. మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు చేర్చి రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.