News February 5, 2025

కాగజ్‌నగర్‌లో దేశీదారు స్వాధీనం

image

కాగజ్‌నగర్‌లో బుధవారం దేశీదారు బాటిల్స్ పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దేశీ దారు స్వాధీనం చేసుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News March 25, 2025

కరీంనగర్‌కు రెండు కొత్త కాలేజీలు

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజినీరింగ్, లా కళాశాలలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రెండు కళాశాలల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహన యూనివర్సిటీలో లా కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల కావాలని ఎప్పటినుంచో ఇంజినీరింగ్ విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేశాయి. తాజాగా రెండు కళాశాలలు మంజూరు కావడంతో విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

News March 25, 2025

బంగ్లాలో సైనిక తిరుగుబాటు?

image

బంగ్లాదేశ్‌లో సైనిక తిరుగుబాటు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యూనస్ పట్ల బంగ్లా సైన్యం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐదుగురు లెఫ్టినెంట్ జనరల్స్, 8మంది మేజర్ జనరల్స్‌, కమాండర్స్, కీలక అధికారులతో ఆర్మీ చీఫ్ వకెర్-ఉజ్-జమాన్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించడంతో తిరుగుబాటు వార్తలు ఊపందుకున్నాయి.

News March 25, 2025

విశాఖ మేయర్ పీఠం.. రంగంలోకి లోకేశ్..?

image

విశాఖ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో జనసేన ఎమ్మెల్సీ పిడుగు హరి ప్రసాద్ నేడు సమావేశమయ్యారు. రేపు మంత్రి లోకేశ్ విశాఖ వచ్చి స్థానిక నేతలతో సమావేశం కానున్నట్లు సమాచారం. అవిశ్వాసంలో నెగ్గితే మేయర్ పదవి టీడీపీకి.. డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు కేటాయించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

error: Content is protected !!