News May 21, 2024
కాగజ్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య
స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కాగజ్‌నగర్‌లోని గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు గొడవ పడ్డారు. దీంతో నలుగురు యువకులు చంద్రశేఖర్(28)ను తలపై రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఈజ్‌గాం SI రామన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Similar News
News December 9, 2024
రాష్ట్రస్థాయి పోటీల్లో ఉమ్మడిADB జిల్లా జట్ల ప్రతిభ
నిజామాబాద్ జిల్లాలోని ఆర్ముర్‌లో మూడు రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి SGFఅండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు ప్రతిభ కనబర్చి కాంస్య పతకాలు సాధించాయి. ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను SGF సెక్రెటరీలు ఫణిరాజా, వెంకటేశ్వర్, కోచ్, మేనేజర్లు బండి రవి, చంద్ పాషా, రాజ్ మహమ్మద్, కోట యాదగిరి, పలువురు అభినందించారు.
News December 9, 2024
మంచిర్యాల: హీటర్ వాడుతున్నారా.. జాగ్రత్త..!
వాటర్ హీటర్ వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాలను తీస్తుంది. ఆదివారం నెన్నెలకు చెందిన స్వప్న(22) వాటర్ హీటర్ వాడుతుండగా విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. హీటర్ ఆన్ చేసి ఉండగా నీటిని తాకవద్దని, హీటర్ స్వీచ్ ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా 5 రోజుల క్రితమే స్వప్న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
News December 9, 2024
మంచిర్యాల: హీటర్ వాడుతున్నారా..జాగ్రత్త..!
వాటర్ హీటర్ వాడుతున్నారా అయితే జాగ్రత్త.. చిన్న నిర్లక్ష్యం ప్రాణాల మీదికి తీసుకువస్తోంది. నిన్న నెన్నెల మండలానికి చెందిన స్వప్న (22) స్నానం కోసం హీటర్ వాడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందింది. కాగా స్వప్న అయిదు రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకుంది. హీటర్ ఆన్ చేసి ఉండగా నీటిని తాకవద్దని.. అలాగే హీటర్ స్వీచ్ ఆఫ్ చేసిన తర్వాతే నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.