News January 24, 2026
కాగజ్‌నగర్‌లో విషాదం.. భవానీ మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 14, 2026
కొత్తగూడెం మేయర్ పదవిని కైవసం చేసుకుంటాం: సీపీఐ

TG: కొత్తగూడెంలో మేయర్ పదవిని కైవసం చేసుకుంటామని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చెప్పారు. ఇప్పటికే KTR కాల్ చేసి BRS తరఫున మద్దతు ప్రకటించినట్లు వెల్లడించారు. ఇండిపెండెంట్ల మద్దతు కూడా ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చ చేయలేదని పేర్కొన్నారు. మేయర్ పదవి గిరిజనులకే ఇస్తామని తెలిపారు. కాగా EC ప్రకారం ఇక్కడ CPI 22, CONG 22, BRS 8, ఇండిపెండెంట్లు 6 సీట్లు, BJP, CPM తలో చోట గెలిచాయి.
News February 14, 2026
తొర్రూర్: 2 సార్లు ఓటమి.. 3వ సారి గెలుపు!

తొర్రూర్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. గతంలో కాంగ్రెస్ నుంచి 2013లో భార్య, 2020లో భర్త పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి భార్య ఎన్నికల బరిలోకి దిగి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 241 ఓట్ల మెజారిటీతో గెలిచి, కౌన్సిల్ స్థానాన్ని సాధించింది. 2 సార్లు ఓడినా, 3వ సారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. కాగా, గతంలో తన ప్రత్యర్థి కూడా 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు.
News February 14, 2026
GNT: కన్నీళ్లు తెప్పిస్తున్న.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు

ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొన్ని సెంటర్లు ప్రజలకు కంటతడి పెట్టిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో రక్షణ లేకుండా ఫుడ్ తయారీ చేస్తున్నారు. ఫుడ్‌లో వినియోగించే స్పైసెస్ గాలికి రోడ్డుపై ప్రయాణించే వారి కళ్లల్లో పడి ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో చేసేది లేక కళ్లు తుడుచుకొని వెళ్తున్నారు. నిర్వాహకులు, అధికారులు జాగ్రత్తలు పాటిస్తే మేలని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.


