News April 30, 2024

కాగజ్‌నగర్‌లో 60 లీటర్ల నాటుసారా స్వాధీనం

image

ఆసిఫాబాద్ జిల్లా ఎక్సైజ్ అధికారి జ్యోతి కిరణ్, కాగజ్‌నగర్ డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో దహేగాం, కౌటాల, చింతలమానేపల్లి మండలంలోని లంబాడీహెట్టి, గుప్పగూడెం, కల్వాడ, రణవెల్లి, మర్రిగూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 60లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 4వేల లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు.

Similar News

News January 12, 2025

జన్నారం: కొత్తూరుపల్లిలో మహిళ హత్య

image

జన్నారం మండలం కొత్తూరుపల్లిలో ఓ మహిళ దారుణహత్యకు గురైంది. ఎస్ఐ రాజ వర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడావి కౌసల్య అనే మహిళకు అదే గ్రామానికి చెందిన కృష్ణతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో కృష్ణ గొడ్డలితో కౌసల్యను నరికి చంపాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 12, 2025

నిర్మల్: మహిళా ఆటో డ్రైవర్‌ను అభినందించిన ఎస్పీ

image

ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై నిర్మల్‌ పాత బస్టాండ్, ట్యాంక్ బండ్, మయూరి సర్కిల్ ఏరియాలో ఎస్పీ జానకీషర్మిల శనివారం పర్యటించారు. అందులో భాగంగా పాత బస్టాండ్ ఏరియాలో ఆటో నడుపుతున్న మహిళా డ్రైవర్‌ను ఎస్పీ ఆప్యాయంగా పలకరించారు. డ్రైవింగ్ ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.

News January 12, 2025

బెల్లంపల్లి: భోజనం నాణ్యతలో రాజీపడొద్దు. జీఎం

image

బెల్లంపల్లి ఏరియా కైరుగూడ ఓపెన్ కాస్ట్‌లో జీఎం శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఆఫీసర్ నరేందర్, గుర్తింపు AITUC సంఘం నాయకులు క్యాంటీన్‌ను శనివారం తనిఖీ చేశారు. క్యాంటీన్‌లో కార్మికులకు అందుతున్న అల్పాహారం, భోజనం, ఏర్పాట్లను పరిశీలించారు. జీఎం మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నాణ్యత విషయంలో రాజీ పడవద్దని పర్సనల్ ఆఫీసర్ వేణును ఆదేశించారు. యూనియన్ నాయకులు అధికారులు ఉన్నారు.