News April 1, 2025
కాగజ్‌నగర్: ఈనెల 3న నర్సరీ పండ్ల తోటల వేలం

కాగజ్‌నగర్ మండలంలోని జంబుగా ఉద్యాన నర్సరీ మామిడిపండ్ల తోటలను ఈనెల 3న వేలం వేస్తున్నట్లు ఐటీడీఏ పీవో కుష్బూగుప్త ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేలం పాటలో (2025- 26- 27) మూడు సంవత్సరాలకు కలిపి వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ తోటలో బంగన్పల్లి, దశేరి తోతపల్లి, రసాలు వంటి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 11 గంటలకు వేలంపాటలో పాల్గొనాల్సిందిగా కోరారు.
Similar News
News December 22, 2025
బీచ్ వాలీబాల్‌లో మెరిసిన తూ.గో కుర్రాళ్లు

బాపట్లలో జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో దుద్దుకూరుకు చెందిన మల్లిపూడి చందు, తాడిపూడికి చెందిన వేములూరు కార్తీక్ ప్రథమ స్థానంలో నిలిచారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం గ్రామస్థులు వీరిని ఘనంగా అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తామని యువకులు ధీమా వ్యక్తం చేశారు.
News December 22, 2025
ఈ దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం

క్రిస్మస్ సందడి మొదలవుతున్న వేళ కొన్ని దేశాల్లో మాత్రం ఈ పండుగపై నిషేధం ఉంది. ఉత్తర కొరియాలో క్రిస్మస్ జరుపుకుంటే కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అఫ్గానిస్థాన్‌లో ఎలాంటి వేడుకలకు అనుమతి లేదు. సోమాలియాలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలను నిషేధించారు. బ్రూనైలో ముస్లిమేతరులు పర్మిషన్ తీసుకుని సెలబ్రేట్ చేసుకోవచ్చు. తజకిస్థాన్‌లోనూ ఆంక్షలు ఉండగా, సౌదీలో బహిరంగ వేడుకలకు అనుమతి లేదు.
News December 22, 2025
భద్రాద్రిలో దాగి ఉన్న అందాలను వెలికి తీయండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లాలో దాగి ఉన్న పర్యాటక అందాలను ఫొటోలు, వీడియోల రూపంలో పరిచయం చేసిన వారికి నగదు బహుమతులు ఇస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పేర్కొన్నారు. వీకెండ్స్‌లో వెళ్లేందుకు 100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ పేరుతో ఒక పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు పెద్దగా తెలియని జలపాతాలు, పురాతన దేవాలయాలు, ట్రెక్కింగ్ పాయింట్లు వంటి 100 కొత్త గమ్యస్థానాలను గుర్తించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.


