News November 29, 2024
కాగజ్‌నగర్: ఏడాది క్రితం వివాహం.. పులి దాడిలో మృతి

కాగజ్‌నగర్ మండలంలోని గన్నారం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మి ఇవాళ ఉదయం పులి దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. లక్ష్మి అదే గ్రామానికి చెందిన వాసుదేవ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. కాగా పెళ్లయిన ఏడాదిలోపే పులి దాడిలో ఆమె మృతి చెందడంతో ఆమె కుటుంబీకుల రోదన అందరిని కంటతడి పెట్టించింది.
Similar News
News April 14, 2026
ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.
News April 13, 2026
ADB: మన ఇసుక – వాహనం’ పోర్టల్ పటిష్ఠ అమలుకు కలెక్టర్ ఆదేశం

ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం పోర్టల్ పై అవగాహన, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని, అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ సమయంలో సరైన పత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.
News April 13, 2026
ఆదిలాబాద్‌లో మెగా ఇండస్ట్రియల్ పార్క్

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణం ఖరారు కావడంతో సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాలకు అవకాశాలు పెరిగాయి. హైవే అనుసంధానం, చనాక-కోరాట నీటి వనరుల లభ్యత కలిసొచ్చే అంశాలు. బీంపూర్, జైనథ్, బోరజ్ మండలాల్లో సుమారు 2,000 ఎకరాల భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మెగా పార్కుతో జిల్లా పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయి.


