News February 8, 2025
కాగజ్‌నగర్: కావేటి సమ్మయ్యను గుర్తు చేసుకున్న KTR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739016347769_20574997-normal-WIFI.webp)
తెలంగాణ భవన్‌లో శనివారం సిర్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ బలోపేతంపై చర్చించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినప్పుడు సిర్పూర్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగిరిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి కావేటి సమ్మయ్య సేవలు మరువలేనివన్నారు.
Similar News
News February 9, 2025
ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739047321550_893-normal-WIFI.webp)
* అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. మెసేజ్‌లకు లేట్‌గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.
News February 9, 2025
బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739045532877_893-normal-WIFI.webp)
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
News February 9, 2025
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739029022924_50226745-normal-WIFI.webp)
ఎల్లారెడ్డి పట్టణ శివారులోని మీసాన్ పల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి నుంచి బిక్కనూర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఏగొండ(18) అనే యువకుడు తన వాహనాన్ని అతివేగంగా నడిపి చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.