News January 30, 2025
కాగజ్‌నగర్: గుండెపోటుతో ఎంపీడీవో మృతి

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల ఎంపీడీవో అలీం గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం హెల్త్‌చెకప్‌కు HYD వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటుతో చనిపోయారు. ఆయన స్వస్థలం కాగజ్‌నగర్ మండలం కాగా ప్రస్తుతం మంచిర్యాలలో నివాసం ఉంటున్నారు. ఏడు నెలల్లో పదవీ విరమణ ఉండగా అంతలోనే విషాదం జరిగిందని కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News February 23, 2026
జగిత్యాల: ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 36 ఫిర్యాదులు, వినతులు స్వీకరించినట్లు కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. ప్రజావాణికి వచ్చే అర్జీలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సమగ్ర విచారణ చేసి వేగంగా పరిష్కారించాలని ఆయన ఆదేశించారు. ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, ఆర్డీవోలు, అధికారులు పాల్గొన్నారు.
News February 23, 2026
ప్రభుత్వ కార్యాలయాల్లో Dy.CM ఫొటో… నేడు క్యాబినెట్లో చర్చ!

TG: GOVT ఆఫీసులలో Dy.CM భట్టి విక్రమార్క ఫొటో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం CM ఫొటో మాత్రమే ఉంది. ఇకపై Dy.CM ఫొటో కూడా ఏర్పాటు చేసేలా నేటి క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. APలో Dy.CM ఫొటో ఏర్పాటుపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. దానివల్ల నష్టం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో TGలో పెట్టినా న్యాయపరంగా ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
News February 23, 2026
శ్రీకాకుళం: ‘ఇంటర్ పరీక్షకు 662 మంది డుమ్మా’

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం మొదటి రోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 662 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలోని 71 కేంద్రాల్లో 20,377 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 19,715 మంది హాజరైనట్లు తెలిపారు. 96.75 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరుగినట్లు, ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదన్నారు.


