News February 3, 2025

కాగజ్‌నగర్: చదువుల తల్లి వేషధారణలో చిన్నారి

image

వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఓ చిన్నారి సరస్వతి మాత వేషధారణలో వచ్చి ఆకట్టుకుంది. చిన్నారిని చేతిలో వీణ, అమ్మవారి వస్త్రధారణలో కిరీటంతో బాల సరస్వతి మాతగా అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ.. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారుల మేధోశక్తి పెంపొంది విద్యపై మక్కువ పెరుగుతుందన్నారు.

Similar News

News November 17, 2025

న్యాయ చట్టాలపై అవగాహన కల్పించాలి: నాగరాణి

image

న్యాయపరమైన చట్టాలపై రిటైర్డ్ ఉద్యోగులు ఇతరులకు అవగాహన కల్పించాలని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి నాగరాణి కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో న్యాయ చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పదవీ విరమణ పొందిన వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండటంతో పాటు, తెలిసినవారికి న్యాయ చట్టాల గురించి తెలియజేయాలని సూచించారు.

19న నల్గొండలో జాబ్ మేళా

image

ప్రైవేటు కంపెనీలలో ఉద్యోగాలను కల్పించేందుకు ఈనెల 19న ఉదయం 10.30 గంటలకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఐటీఐ క్యాంపస్‌లో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ తెలిపారు. ఈ జాబ్ మేళాలో ఎంపికైన వారు నల్గొండ, హైదరాబాద్‌లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్నారు. పదో తరగతి, గ్రాడ్యుయట్, D/B/M- Pharmacy చదివిన వారు అర్హులని తెలిపారు.