News February 3, 2025

కాగజ్‌నగర్: చదువుల తల్లి వేషధారణలో చిన్నారి

image

వసంత పంచమి సందర్భంగా పట్టణంలోని సరస్వతీ శిశు మందిర్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఓ చిన్నారి సరస్వతి మాత వేషధారణలో వచ్చి ఆకట్టుకుంది. చిన్నారిని చేతిలో వీణ, అమ్మవారి వస్త్రధారణలో కిరీటంతో బాల సరస్వతి మాతగా అందంగా అలంకరించారు. అనంతరం వేద పండితులు మాట్లాడుతూ.. వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే చిన్నారుల మేధోశక్తి పెంపొంది విద్యపై మక్కువ పెరుగుతుందన్నారు.

Similar News

News January 16, 2026

ఇది HYD మెట్రో ప్రయాణికుల కోసం!

image

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు విజ్ఞప్తి. L&T మెట్రో రైల్ కొత్తగా సర్వే చేస్తోంది. పై ఫొటోలో ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంచుకోవాలని పిలుపునిచ్చింది. దీని వలన ప్రయాణం మరింత సులభంగా, సౌకర్యవంతంగా చేయడానికి సాయం చేస్తుందని పేర్కొంది. నిత్యం మెట్రోలో ప్రయాణించేవారికి ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేసింది.

News January 16, 2026

జగ్గన్నతోట తీర్థంలో ప్రముఖుల సందడి

image

జగ్గన్నతోట ప్రభల తీర్థాన్ని శుక్రవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. మంత్రి వాసంశెట్టి సుభాశ్, ఎంపీ సానా సతీశ్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, బీజేపీ నేత మాధవ్ ఏకాదశ రుద్రులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లకు పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వారి వెంట కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీతో తీర్థ ప్రాంతం జనసందోహంగా మారింది.

News January 16, 2026

మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల

image

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశ పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలతో పాటు 7-10 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. OC విద్యార్థులు రూ.200, మిగతావారు రూ.125 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. మార్చి/ఏప్రిల్‌లో హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. April 19న ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అనంతరం ఫలితాలు వెలువడనున్నాయి.