News April 10, 2025
కాగజ్నగర్: దేశంలో నియంతృత్వ పాలన: MLC

దేశంలో ప్రజాస్వామ్య నియంతృత్వ పాలన కొనసాగుతుందని ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. గురువారం రాత్రి కాగజ్నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం మార్చాలని కుట్రతో పరిపాలన కొనసాగిస్తుందన్నారు. రాజ్యాంగ రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు పట్టం కట్టాల్సిందిగా కోరారు.
Similar News
News October 17, 2025
ఒకే స్కూల్లో అక్క–తమ్ముడు టీచర్లు!

నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన బాల స్వామి–నాగమణి దంపతుల కుమార్తె సారా పింకీ, కుమారుడు శామ్యూల్ మెగా డీఎస్సీ-2025లో టీచర్లుగా ఎంపికయ్యారు. వీరిద్దరికీ తుగ్గలి మండల హుసేనాపురం ఉర్దూ పాఠశాలలోనే పోస్టింగ్ రావడం విశేషం. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ స్థాయికి చేరుకున్నామని, విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వారు తెలిపారు.
News October 17, 2025
బీజేపీ, బీఆర్ఎస్కు బీసీల పట్ల ప్రేమ లేదు: పెద్దపల్లి ఎమ్మెల్యే

ఈనెల 18న బీసీ జేఏసీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ మొదటినుంచి నినదిస్తోందని తెలిపారు. బీసీ కుల గణన నిర్వహించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ కు బీసీల పట్ల ప్రేమ లేదన్నారు.
News October 17, 2025
ప్రసూతి మరణాల నివారణకి చర్యలు: కలెక్టర్

ప్రసూతి మరణాలు సంభవించకుండా వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. శుక్రవారం మధ్యాహ్నం తన ఛాంబర్లో వైద్యాధికారులతో సమావేశమైన కలెక్టర్ ప్రసూతి మరణాలపై సమీక్షించారు. మాతృత్వ మరణాలను నివారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. హైరిస్క్ ప్రెగ్నెంట్ కేసుల విషయంలో వైద్యులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రాణ నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.