News November 30, 2024
కాగజ్నగర్: పెద్దపులితో ముగ్గురు.. ఏనుగుతో ఇద్దరు మృతి
కాగజ్నగర్ డివిజన్లో అడవి జంతువుల దాడిలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. 2020 NOV 18న పెద్దపులి దాడిలో దిగిడ గ్రామానికి చెందిన విగ్నేష్ మృతి చెందాడు. అదే నెల 29న కొండపల్లిలో నిర్మల అనే మహిళపై పులి దాడి చేసి చంపేసింది. 2024 ఏప్రిల్లో ఏనుగు దాడిలో మరో ఇద్దరు మృతి చెందారు. కాగా నిన్న గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మిపై పెద్దపులి దాడి చేసి చంపేసింది. నాలుగేళ్లలో ఐదుగురి మృతి కలవరపెడుతోంది.
Similar News
News December 27, 2024
సిర్పూర్ (టి): ‘అడవుల సంరక్షణ అందరి బాధ్యత’
అటవీ సంరక్షణ అభివృద్ధిలో ఉద్యోగులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కంపా పిసిసిఎఫ్ సువర్ణ అన్నారు. సిర్పూర్ టి రేంజ్ పరిధిలోని ఇటుకల పహాడ్ గ్రామాన్ని సిఎఫ్ శాంతారాం, డిఎఫ్ఓ నీరజ్ కుమార్తో కలిసి సందర్శించి అక్కడ కంపా నిధులతో చేసిన ప్లాంటేషన్ పరిశీలించి అనంతరం గ్రామస్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్లాంటేషన్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.
News December 26, 2024
నిర్మల్ : ‘కేజీబీవీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి’
కేజీబీవీ, సమగ్రశిక్షా ఉద్యోగులు నిరసన చేపడుతున్న సందర్భంగా ఆయా మండలాల్లో కస్తూర్బా విద్యాలయాల్లో ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేయాలని డీఈవో రామారావు ఎంఈవోలను గురువారం ప్రకటనలో ఆదేశించారు. వారు కేజీబీవీ పాఠశాలల్లో వంట మనుషులు, వాచ్మెన్లు , టీచింగ్ స్టాఫ్ను సర్దుబాటు చేయాలని ఎంఈఓలకు సూచించారు.
News December 26, 2024
నిర్మల్: చెత్త కవర్లో శిశువు మృతదేహం లభ్యం
మున్సిపల్ చెత్త వాహనంలో నవజాత శిశువు లభ్యమైన ఘటన గురువారం నిర్మల్లో చోటుచేసుకుంది. నిర్మల్ మున్సిపాలిటీకి చెందిన ఓ వాహనం చెత్త పడేయడానికి డంపింగ్ యార్డ్కు వెళుతుండగా మార్గమధ్యంలో ఓ కవర్ కింద పడింది. సిబ్బంది దాన్ని పరిశీలించగా అందులో నవజాత శిశువు మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామన్నారు.