News February 8, 2025
కాగజ్నగర్: భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News October 16, 2025
కోహ్లీ ట్వీట్పై విమర్శలు.. ఎందుకంటే?

ఆస్ట్రేలియాకు వెళ్లిన రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ‘పోరాటాన్ని ఆపినప్పుడే ఓడిపోయినట్లు’ అని ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో తమ అభిమాన ఆటగాడు గివప్ ఇవ్వరంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇది యాడ్ కోసం చేసిన ట్వీట్ అని తెలియడంతో చాలామంది అసంతృప్తికి లోనయ్యారు. తమ అభిమానంతో ఆడుకోవడం కరెక్టేనా? అని మండిపడ్డారు. ఇది యాడ్ పోస్ట్ అని ముందే తెలుసంటూ మరికొందరు పేర్కొన్నారు.
News October 16, 2025
జగిత్యాలలో స్కానింగ్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ

PCPNDT చట్టం అమలు, లింగ నిర్ధారణ నిషేధాన్ని పాటిస్తున్నారా లేదా అనే అంశాలపై మాతా-శిశు సంరక్షణ అధికారి డా.ముస్కు జైపాల్ రెడ్డి గురువారం పలు స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫారం ‘ఎఫ్’ సమర్పణ, వైద్యుల అర్హత పత్రాలు, ‘లింగ నిర్ధారణ లేదు’ అనే బోర్డుల వివరాలు పరిశీలించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్షతో పాటు రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని కేంద్రాల నిర్వాహకులను ఆయన హెచ్చరించారు.
News October 16, 2025
అభివృద్ధిలో ఏపీ దూసుకెళ్తోంది: మోదీ

AP: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందని ప్రధాని మోదీ కర్నూలు జీఎస్టీ సభలో అభినందించారు. ‘చంద్రబాబు చెప్పినట్లు 2047 నాటికి కచ్చితంగా మన దేశం వికసిత్ భారత్గా మారుతుంది. ఏపీలో ఎన్నో అవకాశాలతో పాటు యువతకు అపార శక్తి ఉంది. సైన్స్, ఆవిష్కరణలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఉంది. ఈ రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్దతు ఉంది’ అని పేర్కొన్నారు.