News February 21, 2025

కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ పున:ప్రారంభం

image

ఆసిఫాబాద్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. ఈ నెల 16 నుంచి 20 వరకు తాత్కాలికంగా రద్దు చేసిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ తిరిగి ఇవాళ నుంచి పునరుద్ధరించనున్నారు. మధ్యాహ్నం 3.35గం.లకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇది బయలుదేరనుంది. ప్రయాణికులు గమనించాలని రైల్వేశాఖ అధికారులు కోరారు.

Similar News

News March 21, 2025

గద్వాల: సుంకేసుల డ్యామ్‌ను పరిశీలించిన కలెక్టర్

image

తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని, ప్రాజెక్టు పనితీరును జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ గురువారం పరిశీలించారు. అనంతరం రాజోలి గ్రామ సమీపాన ఉన్న సుంకేసుల బ్యారేజిని సందర్శించి, నీటి నిల్వ సామర్థ్యంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో.. తహశీల్దార్ రామ్మోహన్, ఎస్ఐ జగదీశ్వర్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దస్తగిరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

News March 21, 2025

వనపర్తిలో వ్యక్తికి జైలు శిక్ష 

image

ప్రజలు ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపవద్దని వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్ రెడ్డి అన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన కేసులో వనపర్తికి చెందిన రమేశ్ నాయక్ అనే వ్యక్తిని గురువారం కోర్టులో హాజరు పరచగా.. అతడికి కోర్టు 6 రోజుల జైలు శిక్ష విధించామని తెలిపారు. వాహనదారులు మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

News March 21, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 21, శుక్రవారం ఫజర్: తెల్లవారుజామున 5.07 గంటలకు సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు అసర్: సాయంత్రం 4.45 గంటలకు మఘ్రిబ్: సాయంత్రం 6.27 గంటలకు ఇష: రాత్రి 7.39 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

error: Content is protected !!