News February 8, 2025
కాగజ్‌నగర్: భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రద్దు

సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య రోజువారీగా రాకపోకలు సాగించే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం.17233, 17234)ను ఈ నెల 10 -20వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు ఇబ్బందులు పడనున్నారు. ఇటీవల కాలంలో ఏ చిన్న సమస్య వచ్చినా రోజుల తరబడి రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 28, 2025
NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.
News March 28, 2025
భార్యను చంపి.. సూట్‌కేసులో కుక్కి..

బెంగళూరులో ఘోరం జరిగింది. మహారాష్ట్రకు చెందిన రాకేశ్ సంబేకర్ అనే వ్యక్తి తన భార్య(32)ను హత్య చేశాడు. అనంతరం సూట్‌కేసులో కుక్కి పరారయ్యాడు. తానే చంపానని ఆమె తల్లిదండ్రులకు నిందితుడు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని గాలించి పుణేలో పట్టుకున్నారు. తమ మధ్య గొడవల సమయంలో భార్య తరచూ చేయిచేసుకుంటోందన్న కోపంతోనే భర్త ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
News March 28, 2025
నేడు చెన్నైకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు నేడు చెన్నై వెళ్లనున్నారు. మద్రాస్ ఐఐటీలో జరగనున్న ‘ఆలిండియా రీసెర్చ్ స్కాలర్స్ సమిట్’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఏఐ, ఐఓటీ వంటి పలు అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. తిరిగి సాయంత్రం సీఎం అమరావతికి చేరుకుంటారు.