News January 27, 2025
కాగజ్నగర్ మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్గా అడిషనల్ కలెక్టర్

మునిసిపల్ పాలకవర్గ కాలపరిమితి ముగియడంతో రాష్ట్రప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లను నియమించింది. అందులో భాగంగా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ ప్రత్యేక అధికారిగా ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు మున్సిపల్ కమిషనర్, S.అంజయ్య, సిబ్బంది స్వాగతం పలికారు.
Similar News
News December 13, 2025
కానిస్టేబుల్స్కు 16న నియామక పత్రాలు: హోంమంత్రి అనిత

కొత్తగా ఎన్నికైన కానిస్టేబుల్స్కు ఈనెల 16న నియామక పత్రాలు అందజేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్లో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ ఏర్పాట్లను ఆమె పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నియామక పత్రాలు అందుకోవడానికి ఎంపికైన అభ్యర్థులు కుటుంబ సభ్యులతో హాజరుకానున్నట్లు చెప్పారు.
News December 13, 2025
తూ.గో: కాంగ్రెస్ పార్టీకి బిల్డర్ బాబి రాజీనామా!

వ్యక్తిగత కారణాలతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని లేఖలో పేర్కొన్నారు. ఈమేరకు తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలకు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావుకు పంపినట్లు తెలిపారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


