News February 2, 2025
కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో వ్యక్తి మృతదేహం

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 1, 2026
పాలమూరు వాసికి విశిష్ట రంగస్థల పురస్కారం

2026 సంవత్సరానికి గాను విశిష్ట రంగస్థల పురస్కారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన డాక్టర్ కోట్ల హనుమంతరావుకు వరించింది. బాలనటుడిగా రంగ ప్రవేశం చేసిన ఈయన, రంగస్థల కళల్లో పీహెచీ పూర్తి చేశారు. ప్రస్తుతం సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారాన్ని ఈనెల 2న హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో ప్రదానం చేయనున్నారు. #CONGRATULATIONS
News January 1, 2026
ఖురాన్‌పై ప్రమాణం చేసిన న్యూయార్క్ మేయర్ మమ్దానీ

న్యూయార్క్ నగర మేయర్‌గా భారత మూలాలున్న జోహ్రాన్ మమ్దానీ ప్రమాణ స్వీకారం చేశారు. ఇస్లాం మతాన్ని ఆచరించే ఆయన ఖురాన్‌పై ప్రమాణం చేసిన తొలి మేయర్‌గా నిలిచారు. 1945లో మూసివేసిన సిటీ హాల్ IRT సబ్వే స్టేషన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. అద్దెల నియంత్రణ, ఫ్రీ బస్సు సర్వీస్, ఫ్రీ చైల్డ్‌కేర్ వంటి హామీలతో మమ్దానీ ఎన్నికల్లో గెలిచారు. నిధుల కోసం సంపన్నులపై పన్నులు పెంచుతామని ప్రకటించారు.
News January 1, 2026
నితీశ్ ఆస్తులు: ₹1.48 కోట్ల ఫ్లాట్.. ₹11.32 లక్షల కారు

బిహార్ CM నితీశ్ కుమార్ సహా ఆయన క్యాబినెట్ మంత్రులు 2025 చివరి రోజు నాటికి వారి ఆస్తుల వివరాలు వెల్లడించారు. నితీశ్ చేతిలో ₹20,552 నగదు, మూడు బ్యాంక్ అకౌంట్లలో కలిపి ₹57,766 అమౌంట్ ఉంది. ₹2.03 లక్షల విలువ చేసే జువెలరీ, ₹11.32 లక్షల ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు ఆస్తుల లిస్ట్‌లో ఉన్నాయి. మొత్తం ఆయన చరాస్తుల విలువ ₹17,66,196. అలాగే ₹1.48 కోట్ల మార్కెట్ విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది.


