News February 2, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతదేహం

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 19, 2025

వనపర్తి జిల్లాలో నాలుగువేల కోళ్లు మృత్యువాత

image

వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొన్నూరు గ్రామానికి చెందిన ఓ రైతు కోళ్ల ఫామ్‌లో అకస్మాత్తుగా సుమారు 4వేల కోళ్లు మృతి చెందడంతో పెంపకందారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నట్టుండి కోళ్లు మృతి చెందడంతో బర్డ్ ఫ్లూ వచ్చిందా లేక ఇంకే కారణంతోనైనా చనిపోయాయా అని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పశువైద్యాధికారులు పరిశీలించి కారణమేమిటో గుర్తించి, ప్రభుత్వం తమను ఆదుకోవాలని పెంపకందారులు కోరుతున్నారు.

News February 19, 2025

ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

image

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.

News February 19, 2025

‘బుక్’ పాలిటిక్స్

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!