News September 17, 2024
కాగజ్‌నగర్: లడ్డూ దక్కించుకున్న ముస్లిం దంపతులు
ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో మతసామరస్యం వెల్లివిరిసింది. గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డూను వేలం పాటలో ముస్లిం దంపతులు దక్కించుకున్నారు. గ్రామానికి చెందిన అప్జల్- ముస్కాన్ దంపతులు రూ.13,216లకు వినాయకుని లడ్డూను వేలం పాటలో పాల్గొని కైవసం చేసుకున్నారు.
Similar News
News October 15, 2024
SUPER: మంచిర్యాల: ఫ్రెండ్స్ అంటే వీళ్లే
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన బోడకుంట మహేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా.. అతడి మిత్రులు మహేశ్ జ్ఞాపకార్థం గ్రామశివారు ఎక్స్‌రోడ్డు వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సుషెల్టర్ ఏర్పాటుచేశారు. ఈ షెల్టర్‌ను మహేశ్ తల్లిదండ్రులు సోమవారం ప్రారంభించారు. దీంతో వారిని గ్రామస్థులు అభినందించారు.
News October 15, 2024
ఆదిలాబాద్: ఈనెల 18న పోటీలు… GET READY
ప్రపంచ పర్యాటక దినోత్సవంను పురస్కరించుకొని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మూడు అంశాలపై ఫోటో ఎక్సిబిషన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా పర్యాటక శాఖ అధికారి రవికుమార్ పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు, వైల్డ్ లైఫ్, సంస్కృతి పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీలు ఈనెల 18న టీటీడీసీలో ఉంటాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే ఔత్సాహికులు వివరాలకు 9440816087 సంప్రదించాలన్నారు.
News October 15, 2024
నిజాయితీ చాటుకున్న బెల్లంపల్లి కండక్టర్
బెల్లంపల్లికి చెందిన బస్ కండక్టర్ గాజనవేణి రాజేందర్ తన నిజాయితీని చాటుకున్నాడు. మందమర్రికి చెందిన ఓ మహిళ బస్సులో సీటు కోసం పర్సు వేసింది. కాని బస్సులో రద్దీ కారణంగా బస్సు ఎక్కలేకపోయింది. దీంతో ఆమె తన పర్సులోనే మరిచిపోయిన ఫోన్‌కు కాల్ చేయగా కండక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి పర్సును భద్రపరిచి బాధితురాలికి అందించాడు. కాగా పర్సులో రూ. 20వేలు, 2 తులాల బంగారం ఉన్నట్లు సదరు మహిళ తెలిపింది.