News March 22, 2025

కాగజ్‌నగర్: 3 ఇళ్లల్లో చోరీ.. నిందితుడు అరెస్ట్

image

3 ఇళ్లలో చోరీ చేసిన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పట్టణంలోని బాలాజీ నగర్‌లో  కొద్ది రోజుల క్రితం 3 ఇళ్లలో చోరీ జరిగింది. కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ప్రదీప్ అనే నిందితుడుని పట్టుకున్నామన్నారు. అతడి వద్ద 86.6 గ్రా. బంగారు ఆభరణాలు, కారు, సెల్ ఫోన్, రూ.12వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు.

Similar News

News March 28, 2025

ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదు: శార్దూల్

image

IPL వేలంలో ఎంపిక కాకపోవడంతో ఈ సీజన్‌లో ఆడతానని అనుకోలేదని LSG బౌలర్ శార్దూల్ ఠాకూర్ తెలిపారు. ‘నేను కౌంటీ క్రికెట్ ఆడాలని ప్లాన్ చేసుకున్నా. రంజీలో ఆడుతున్నప్పుడు జహీర్ ఖాన్ ఫోన్ చేసి నన్ను రీప్లేస్‌మెంట్‌గా తీసుకుంటామని చెప్పారు. జీవితంలో ఎత్తుపల్లాలు ఒక భాగం. నేను ఎప్పుడూ నా స్కిల్స్‌నే నమ్ముకుంటా’ అని పేర్కొన్నారు. గాయం కారణంగా టోర్నీకి దూరమైన మోహ్సిన్ ఖాన్ స్థానంలో శార్దూల్ జట్టులోకి వచ్చారు.

News March 28, 2025

నేడు ప.గో జిల్లాలో పవన్ పర్యటన

image

AP: Dy.CM పవన్ కళ్యాణ్ ఇవాళ ప.గో జిల్లాలో పర్యటించనున్నారు. తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆయన ఆలోచన చేస్తున్నట్లు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. నేడు ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించనున్నారు. అన్ని శాఖల అధికారులు, గ్రామస్థులతో సమావేశమవుతారు. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి, ప్రజలు ఇచ్చే అర్జీలను స్వీకరిస్తారు.

News March 28, 2025

కలెక్షన్లలో ‘L2: ఎంపురాన్’ రికార్డు

image

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘L2: ఎంపురాన్’ దేశవ్యాప్తంగా తొలి రోజు ₹21కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఇంతకముందు ఈ రికార్డు పృథ్వీరాజ్ ‘ది గోట్ లైఫ్’ (₹8.95cr) పేరిట ఉండేది. ‘లూసిఫర్’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా నిన్న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే. మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉంది?

error: Content is protected !!