News March 29, 2024
కాగజ్ నగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలు
కాగజ్ నగర్ బస్టాండ్ సమీపంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణ ప్రాంగణం నుంచి ఆర్టీసీ బస్సు ఆసిఫాబాద్ బయలు దేరగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి బస్సు కిందకు పోయింది. బస్సును డ్రైవర్ నిలుపుదల చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. అక్కడే ఉన్న పలువురు ఇద్దరు యువకులను బయటకు లాగారు. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి.
Similar News
News January 16, 2025
ఆదిలాబాద్: రైతు భరోసా సర్వేకు 102 బృందాలు
ADB జిల్లా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా లక్షా 62వేల పట్టా పాసు పుస్తకాలు ఉండగా ఆ డేటా ఆధారంగానే అధికారులు వెరిఫికేషన్ చేయనున్నారు. 102 క్లస్టర్లలో సర్వేకు 102 అధికార బృందాలు సిద్ధమయ్యాయి. ఇందులో వ్యవసాయ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులు పాల్గొంటారు. గతంలో సాగు అనువుకాని భూమికి సైతం రైతుబంధు ఇచ్చారనే ఆరోపణల నేపథ్యంలో పకడ్బందీగా సర్వే చేయనున్నట్లు వారు చెబుతున్నారు.
News January 16, 2025
ADB: మైనర్‌ను నమ్మించి అత్యాచారం చేశాడు..!
యువకుడిపై ADB పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. CI కర్ణాకర్ కథనం ప్రకారం.. ADBరిమ్స్‌లో చదువుతున్న బాలిక(17)కు INSTAGRAMలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకులకు చెందిన శివ పరిచయమయ్యాడు. పెళ్లిచేసుకుంటానని నమ్మించడంతో ఈనెల 9న HYDవెళ్లగా ఆమెను ప్రలోభపెట్టి అత్యాచారం చేశాడు. ఆమె కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఆచూకీ తెలుసుకొని ADBరప్పించి ఆమె వాంగ్మూలం తీసుకొని కేసువేశారు.
News January 16, 2025
ప్రజలు పోలీసు సేవలు వినియోగించుకోవాలి: నిర్మల్ SP
భైంసా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని ఎస్ఐ, సీఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా పోలీసు సేవలను వినియోగించుకోవాలని కోరారు.