News March 7, 2025

కాచిగూడ-నిజామాబాద్‌ డెమూ రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్‌ మధ్య నడిచే (77601/77602) డెమూ రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్‌ సెక్షన్‌లో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్‌ఓ శ్రీధర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

Similar News

News October 28, 2025

అందరూ ప్రజలకు అండగా ఉండాలి: చంద్రబాబు

image

‌మొంథా తుపాను నేపథ్యంలో కూటమి ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో సీఎం చంద్రబాబు మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు, రేపు అప్రమత్తంగా ఉండి ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. లీడర్ నుంచి కేడర్ వరకు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలంతా ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

News October 28, 2025

ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల లాభమేంటి?

image

కలుపు నివారణలో మల్చింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్లాస్టిక్ షీటును మొక్క చుట్టూ నేలపై కప్పడాన్ని ప్లాస్టిక్ మల్చింగ్ అంటారు. ప్లాస్టిక్ మల్చింగ్ వల్ల నేల తేమను నిలుపుకుంటుంది. కలుపు కట్టడి జరుగుతుంది. పంట ఏపుగా పెరిగి దిగుబడి బాగుంటుంది. కూరగాయల సాగుకు ఇది అనుకూలం. మల్చింగ్‌ చేసిన ప్రాంతంలో పంటకాలం పూర్తయ్యాక దున్నాల్సిన అవసరం లేకుండా పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు.

News October 28, 2025

HYD: హరీశ్‌రావు ఇంటికి KTR.. కార్యక్రమాలు రద్దు

image

హరీశ్‌రావు తండ్రి మరణించిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన ఇంటికి బయలుదేరారు. పితృవియోగం కారణంగా ఈ రోజు జరగాల్సిన పార్టీ కార్యక్రమాలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. కోకాపేటలోని హరీశ్‌రావు ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు చేరుకున్నారు.