News April 10, 2025

కాచిగూడ నుంచే తుంగభద్ర ఎక్స్‌ప్రెస్

image

తుంగభద్ర ఎక్స్‌ప్రెస్ ఈనెల 15 నుంచి మే 10 వరకు కాచిగూడ స్టేషన్ నుంచి నడుపుతున్నట్లు SCR అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 7:55 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. కర్నూలుకు మధ్యాహ్నం 12:30కు చేరుకుంటుందన్నారు.

Similar News

News September 19, 2025

అందుకే నేనింకా పెళ్లి చేసుకోలేదు: అమీషా

image

పెళ్లి తర్వాత వర్క్ చేయొద్దని కండిషన్స్ పెడుతుండటం వల్లే తాను ఇప్పటిదాకా వివాహం చేసుకోలేదని నటి అమీషా పటేల్ వెల్లడించారు. ’50 ఏళ్ల వయసులోనూ నాకు ప్రపోజల్స్ వస్తున్నాయి. నా ఏజ్‌లో సగం వయసున్న వారూ డేట్‌కి రమ్మని అడుగుతుంటారు. సినిమాల్లోకి రాకముందు సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా. ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్లొద్దనడంతో వదులుకున్నా. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమే’ అని ఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

News September 19, 2025

బైరెడ్డి హౌస్ అరెస్ట్

image

నందికొట్కూరు వైసీపీ సమన్వయకర్త డా.దారా సుధీర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ‘ఛలో మెడికల్ కాలేజ్’ కార్యక్రమంలో భాగంగా నంద్యాలకు వెళ్తున్న ఆయనను నందికొట్కూరు డిగ్రీ కాలేజ్ వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు రోడ్డుపై భైఠాయించి నిరసనకు దిగారు. మరోవైపు వైసీపీ యువ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెళ్లి తీరుతానని ఆయన స్పష్టం చేశారు.

News September 19, 2025

శాసనమండలి వాయిదా

image

AP: శాసనమండలిలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని కోరింది. ఆ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించడంతో వైసీపీ సభ్యులు పోడియం ఎదుట నిరసనకు దిగారు. దీంతో శాసనమండలి వాయిదా పడింది.