News September 14, 2024
కాజీపేటలో వందేభారత్ హాల్ట్

సికింద్రాబాద్-నాగ్పూర్ మధ్య ఈ నెల 16 నుంచి వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం రామగుండం, కాజీపేట స్టేషన్లలోనే హాల్టింగ్ సౌకర్యం ఉంది. మంగళవారం మినహా నాగ్పూర్లో ఉ.5 గంటలకు బయల్దేరి మ.12.15 గం.కు ఈ రైలు సికింద్రాబాద్ చేరుతుంది. మ.ఒంటి గంటకు SCలో బయల్దేరి రాత్రి 8.20 గంటలకు నాగ్పూర్ చేరుతుంది.
Similar News
News January 4, 2026
గడువులోగా ఫొటో సిమిలర్ ఎంట్రీల పూర్తి

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR)లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీ ప్రక్రియను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేస్తామని జిల్లా ఎన్నికల అధికారి డా.సత్య శారద తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి ఓటరు జాబితా స్వచ్ఛీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన తీరును వివరించారు.
News January 1, 2026
భద్రకాళి క్షేత్రంలో ఆధ్యాత్మిక వెల్లువ.!

భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో కొత్త ఏడాదిని ప్రారంభించేందుకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయం వద్ద క్యూలైన్లలో వేచి ఉండి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలవబడే భద్రకాళి అమ్మవారికి అర్చకులు నిర్వహించిన ప్రత్యేక అలంకరణ భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
News January 1, 2026
వరంగల్: లక్ష్యసాధనకు పునరంకితం కావాలి: సీపీ

నూతన సంవత్సరాన్ని నూతనోత్సాహంతో ప్రారంభించి, ఉన్నత లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. 2026లోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సామాజిక బాధ్యతను గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.


