News January 29, 2025
కాజీపేట- అజ్నీ బండి నడపండి సారూ!

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసింజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, హనుమకొండ జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.
Similar News
News February 20, 2025
రాత్రిపూట వీటిని తింటున్నారా?

రాత్రి పూట కొన్ని ఆహార పదార్థాల జోలికి పోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీ, సోడా, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ తినకూడదు. ఇవి తింటే సరిగ్గా నిద్రపట్టదు. స్వీట్లు, చాక్లెట్లు తినడం మంచిది కాదు. పరోటా, బంగాళదుంపల జోలికి వెళ్లొద్దు. డీప్ ఫ్రై, స్పైసీ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. సిట్రస్ పండ్లు, పచ్చి ఉల్లిపాయలు తింటే కడుపులో మంట, ఉబ్బరం, అజీర్తి సమస్యలు తలెత్తుతాయి.
News February 20, 2025
భద్రాద్రి జిల్లా TOP NEWS

✓భద్రాచలం సరిహద్దు గ్రామాల్లో పోలీసుల ముమ్మర తనిఖీ✓ భద్రాచలంలో చైన్ స్నాచింగ్ ✓ సేవాలాల్ జయంతి వేడుకల్లో స్టెప్పులేసిన జిల్లా కలెక్టర్ ✓ మణుగూరులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత ✓ సంపన్నుల కోసమే కేంద్ర బడ్జెట్: సీపీఎం✓ జాతరలో ఎమ్మెల్యే కోరం కనకయ్య డాన్స్ ✓ భద్రాచలంలో ఎండు గంజాయి పట్టుకున్న పోలీసులు ✓ అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు చర్యలు: భద్రాద్రి ఎస్పీ
News February 20, 2025
నల్గొండ జిల్లా టాప్ న్యూస్

☞ లింగమంతుల స్వామిని దర్శించుకున్న మంత్రి కోమటిరెడ్డి ☞ దామరచర్ల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి ☞ నల్గొండలో ఘోర రోడ్డుప్రమాదం ☞ తనపై దాడులు చేస్తున్నారని శాంతమ్మ అనే వృద్ధురాలి ఆవేదన ☞ ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ☞ శివాజీ జయంతి.. నల్గొండలో భారీ ర్యాలీ