News January 29, 2025

కాజీపేట- అజ్నీ బండి నడిపండి సారూ!

image

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్లార్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసింజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Similar News

News December 3, 2025

కొడంగల్: పల్లెపోరు.. డైలమాలో అభ్యర్థులు

image

కొడంగల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సమరం ఉత్కంఠగా సాగుతోంది. కొడంగల్, దౌల్తాబాద్, దుద్యాల, బొంరాస్‌పేట మండలాల పరిధిలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు బుధవారం ఉపసంహరించుకునేందుకు గడువు ఉండడంతో గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పోటీలో ఉండాలా, తప్పుకోవాలా అనే డైలమాలో అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది అభ్యర్థుల వివరాలు, గుర్తులు వెల్లడి అవుతాయి.

News December 3, 2025

వేములవాడ: రాజన్న ఆలయాభివృద్ధి.. ‘ఆఫీసర్లపై ఆంక్షలు’

image

వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, ముఖ్యంగా ఇంజినీరింగ్ పనులకు సంబంధించి ఆయా అధికారులు అస్సలు నోరు విప్పడం లేదట. డెవలెప్‌మెంట్ పనులు, పురోగతికి సంబంధించి ఎటువంటి సమాచారం మీడియాకు లీక్ చేయొద్దనే ఆంక్షలను ఆఫీసర్లపై విధించారట. దీంతో ఆలయాభివృద్ధి పనులకు సంబంధించిన సమాచారమేదీ పక్కాగా బయటకు రావడంలేదు. కాగా, ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఏ చిన్న విషయమైన తెలుసుకోవాలని ప్రతి భక్తుడికి సాధారణంగా ఉంటుంది.

News December 3, 2025

అంబేడ్కర్ భవన్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

image

ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హనుమకొండ అంబేడ్కర్ భవన్‌లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దివ్యాంగుల విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఉపకార వేతనాలు, సబ్సిడీ రుణాలు వంటి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఈ సందర్భంగా వారి హక్కులు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.