News January 29, 2025

కాజీపేట- అజ్నీ బండి నడిపియండి సారూ!

image

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసెంజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Similar News

News November 22, 2025

‘మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలి’

image

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం ఇవ్వాలని ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. బోయినపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(KGBV)ను ఆమె శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టోర్ రూంలో ఆహార సామగ్రి, కోడిగుడ్లు, కూరగాయలను కలెక్టర్ పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆమె ఆరా తీశారు. విద్యార్థులు పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు.

News November 22, 2025

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక అనివార్యమేనా?

image

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే MLA దానం నాగేందర్ AICC పెద్దలతో సమావేశమయ్యారు. అనర్హత అనివార్యమైతే పదవి వదులుకోవాల్సిందే. రాజీనామా చేస్తే MLA టికెట్ తనకే ఇవ్వాలని ఆయన AICCని కోరినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్‌ టికెట్ కోసం ఆశావహులు ముందుకొస్తున్నారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పని చేశానని ఖైరతాబాద్ సీనియర్ లీడర్ రాజు యాదవ్ టికెట్ తనకే ఇవ్వాలని సెంటర్‌లో బ్యానర్ కూడా పెట్టేశారు.

News November 22, 2025

మద్నూర్: బెడిసికొట్టిన ఇసుక స్మగ్లర్ల ‘కొత్త ప్లాన్’.. ఆరుగురి అరెస్ట్

image

మహారాష్ట్రకు ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఆరుగురిని మద్నూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణాకు ఆటకం కలగకుండా ఉండేందుకు చెక్ పోస్టులను దాటించేందుకు కొత్త తరహాలో ప్రయత్నించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న 2 టిప్పర్ డ్రైవర్లు, 4 పైలట్ కార్ల యజమానులతో సహా మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. 2 టిప్పర్లు, 2 కార్లను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.