News January 29, 2025

కాజీపేట- అజ్నీ బండి నడిపియండి సారూ!

image

కాజీపేట-అజ్నీల మధ్య నడిచే ప్యాసింజర్ ట్రైన్ గత కొంతకాలంగా నడవటంలేదు. దీంతో కాజీపేట్-బల్హర్షా సెక్షన్‌ల మధ్య ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్లుగా కొనసాగుతున్న ప్యాసింజర్ సేవల్ని ఇటీవల రైల్వేశాఖ అధికారులు నిలిపివేశారు. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల జిల్లా వాసులు సరైన ప్రత్యామ్నాయం చూసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ట్రైన్ సర్వీస్ పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు.

Similar News

News February 14, 2025

రేవంత్‌వి దిగజారుడు మాటలు: కిషన్ రెడ్డి

image

TG: ప్రధాని మోదీ పుట్టుకతో BC కాదంటూ CM రేవంత్ చేసిన <<15461493>>వ్యాఖ్యలను <<>>కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రేవంత్ తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, అవగాహన లేని వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. అటు డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఎవరు మతం మార్చుకున్నారో చర్చ చేయాలంటే రేవంత్ 10 జన్‌పథ్(సోనియా ఇల్లు) నుంచే ప్రారంభించాలని ఎద్దేవా చేశారు.

News February 14, 2025

ట్రెండింగ్.. ఆమెకు న్యాయం చేయాలని డిమాండ్

image

AP: అన్నమయ్య జిల్లాలో <<15457778>>యాసిడ్ దాడికి<<>> గురైన బాధితురాలికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దాడి చేసింది <<15461253>>టీడీపీ నేత కుమారుడని<<>> ఆరోపణలు వస్తుండటంతో కేసు నీరుగారకుండా చూడాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

News February 14, 2025

ఇక్కడ అద్దెకు బాయ్‌ఫ్రెండ్స్ లభించును

image

ఏంటి షాక్ అయ్యారా? బెంగళూరులో వాలంటైన్స్ డే సందర్భంగా ‘రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్’ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం రూ.389 చెల్లిస్తే చాలు మీకు ఆ రోజుకు ప్రియుడు దొరికినట్లే. నగరంలోని చాలా చోట్ల దీనికి సంబంధించిన పోస్టర్లు వెలిశాయి. అయితే ఈ సంస్కృతి చైనా, జపాన్, థాయ్‌లాండ్‌లో ప్రాచుర్యం పొందింది. ఇది నగర సంస్కృతికి ముప్పుగా భావించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు పలువురు ఫిర్యాదులు చేశారు.

error: Content is protected !!