News April 3, 2025
కాజీపేట: టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన జూదరులు

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ ఇన్స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.
Similar News
News November 11, 2025
రన్నర్‌గా తూ.గో జిల్లా అధికారులు

అనంతపురంలో ఈనెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్-2025 జరిగింది. ఇందులో తూ.గో జిల్లా రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రతిభ చూపారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం.సునీల్ కుమార్, రాజానగరం సీఎస్ డీటీ జి.బాపిరాజు జట్టు రన్నర్‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూ.గో జట్టు రన్నర్‌గా నిలిచింది.
News November 11, 2025
ముంబై ఆ ఇద్దరిని వదిలేయాలి: హెడెన్

IPL రిటెన్షన్స్ ప్రకటనకు ముందు ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ హెడెన్ కీలక సూచనలు చేశారు. గత వేలంలో అధిక ధరకు కొనుగోలు చేసిన బౌల్ట్(₹12.5Cr), దీపక్ చాహర్(₹9.25Cr)ను వదిలేయాలని అభిప్రాయపడ్డారు. వీరిద్దరినీ వదిలేస్తే పర్స్ ఎక్కువగా మిగులుతుందని, టీమ్ బెంచ్ స్ట్రెంత్‌ను స్ట్రాంగ్ చేసుకోవచ్చన్నారు. అవసరమైతే వారిని మళ్లీ తక్కువ ధరకు మినీ వేలంలో తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
News November 11, 2025
ఆరా మస్తాన్ సర్వే.. జూబ్లీహిల్స్ కాంగ్రెస్‌దే!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీదే గెలుపు అని ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 47.49%, BRSకు 39.25%, BJPకి 9.31% ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, నాగన్న సర్వే తదితర ఎగ్జిట్ పోల్స్ సైతం హస్తం పార్టీ గెలుస్తుందని అంచనా వేశాయి. మరి మీరు ఏ పార్టీ విజయం సాధిస్తుందని భావిస్తున్నారు. కామెంట్ చేయండి.


