News January 31, 2025
కాజీపేట రైల్వే స్టేషన్.. 40 శాతం పనులు పూర్తి..!

కాజీపేట రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకంలో భాగంగా రూ.24.45 కోట్లతో జరుగుతున్న నిర్మాణపు పనుల్లో, ఇంటీరియర్ పనులు కొలిక్కి వచ్చినట్లు పేర్కొన్నారు. మరోవైపు మొత్తం పునరాభివృద్ధి పనులు 40 శాతం పూర్తయినట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Similar News
News February 26, 2026
పశ్చిమగోదావరి జడ్పీలో సిబ్బంది కొరత (1/2)

పశ్చిమగోదావరి జిల్లా పరిషత్, జడ్పీ ఉన్నత పాఠశాలలు, ఎంపీడీవో కార్యాలయాలను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. సిబ్బంది లేమి వల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని జడ్పీ ఛైర్‌పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి.. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి సిబ్బంది కొరత లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
News February 26, 2026
రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాల వల్ల అనారోగ్యాల ముప్పుందంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.
News February 26, 2026
‘యూత్ పార్లమెంట్’ పోస్టర్‌ను ఆవిష్కరించిన బండి సంజయ్

వికసిత్ భారత్ 2026 జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీల పోస్టర్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ నెల 28న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాలలో ’50 ఏళ్ల ఎమర్జెన్సీ, భారత ప్రజాస్వామ్య పాఠాలు’ అంశంపై 18-25 ఏళ్ల యువతకు పోటీలు నిర్వహించనున్నారు. ఆసక్తిగల వారు ‘మై భారత్’ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, విద్యార్థులు తమ గళాన్ని జాతీయ స్థాయి వరకు వినిపించాలని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.


