News February 6, 2025
కాజీపేట-విజయవాడ మార్గంలో 30 రైళ్ల రద్దు

మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
విశాఖ పోలీసుల ఫైన్లపై మీరేమంటారు..!

విశాఖలో గత 15నెలల్లోనే పోలీసులు 8.54 లక్షల ఈ-చలాన్లు జారీ చేసి రూ.46.4కోట్ల ఫైన్ విధించారు. ఇప్పటి వరకు రూ.13.39కోట్లు రాబట్టారు. నగరంలో 12 లక్షల వాహనాలు ఉండగా.. కొందరు సిగ్నల్ జంప్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రతి 2రోజులకు ముగ్గురు ప్రాణాలు కోల్పోతున్నారు.మరోవైపు షాపులు, రైతుబజార్ల వద్ద పార్క్ చేసిన వాహనాలకూ ఫైన్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి.
News October 16, 2025
సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: కలెక్టర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టర్ స్వయంగా హాస్పటల్ నిర్మాణ స్థలాన్ని సందర్శించి, జరుగుతున్న సివిల్, ఎలక్ట్రికల్ తదితర పనుల పురోగతిపై సమీక్షించారు. ప్రతి అంతస్తు స్థితిగతులను పరిశీలించిన ఆమె, పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
News October 16, 2025
విజయవాడ: దుర్గగుడి 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి 2026 నూతన క్యాలెండర్ను ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ గురువారం ఆవిష్కరించారు. ఈనెల 23న దుర్గమ్మ గాజుల అలంకారంలో దర్శనమిస్తారని, 19న శ్రీమహాలక్ష్మీ యాగం, 20న శ్రీధనలక్ష్మీ పూజ, దీపాలంకరణ ఉంటుందని తెలిపారు. అనంతరం రాత్రి 7గంటల నుంచి ఆలయాల కవాట బంధనం ఉంటుందన్నారు. కార్తీక మాసం 22 నుంచి నవంబర్ 20 వరకు మల్లేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు నిర్వహిస్తారన్నారు.