News February 6, 2025
కాజీపేట-విజయవాడ మార్గంలో 30 రైళ్ల రద్దు

మూడో లైన్ నిర్మాణ పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే 30 రైళ్లను ఈ నెల 10 నుంచి 20 వరకు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొన్నింటిని సికింద్రాబాద్- నడికుడి మార్గంలో నడిపించనున్నట్లు అధికారులు చెప్పారు. అలాగే వారాంతపు రైళ్లను కూడా రద్దు చేయగా మరికొన్ని రైళ్లు నిర్ణీత తేదీల్లోనే నడుస్తాయని పేర్కొన్నారు.
Similar News
News October 24, 2025
ఎమ్మెల్యే సంజయ్ ఈరోజు ఏం చెబుతారో మరి..?

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నేడు స్పీకర్ సమక్షంలో మరో మారు విచారణను ఎదుర్కోనున్నారు. పిటీషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తరపు న్యాయవాదులు సంజయ్ పై అనర్హత వేటు వేయాలని మౌఖిక వాదనలు వినిపించనున్నారు. కాంగ్రెస్‌లో చేరలేదని, అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని, కాంగ్రెస్‌లో చేరాను అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్రితం విచారణలో సంజయ్ స్పష్టం చేశారు.
News October 24, 2025
NLG: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు షురూ!

జిల్లాలో నేటి నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఇందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. గతేడాది మందుగానే సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల రైతులు ఆయా కేంద్రాల్లో పత్తిని అమ్ముకుని ప్రభుత్వ మద్దతు ధర పొందారు. జిల్లా వ్యాప్తంగా 5,56,826 ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జిల్లాలో ఇవాళ 9 కేంద్రాలను ప్రారంభించనున్నారు.
News October 24, 2025
NLG: ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం

నల్గొండ జిల్లా ధర్వేశిపురం వైన్స్‌కు అత్యధికంగా 152 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున ఆ ఒక్క వైన్స్ నుంచే రూ.4.56 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే జిల్లాలో ఉన్న షాపుల్లో గతంలో కూడా ఈ వైన్స్‌కు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఆ వైన్స్‌కు దరఖాస్తులు చేసినా సింగిల్ దరఖాస్తు చేసిన వ్యక్తికే టెండర్లో వైన్స్ దక్కింది. ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు వేశారు.


